(సంకలనం: శ్రీమతి చార్లెస్ ఇ. కౌమన్; అనువాదం: జోబ్ సుదర్శన్)
నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను (యెషయా 49:11).
ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డువచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టంలేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముల్లు అనుదినం మొయ్యవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉంటాయి గదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా.
మన విజయ జీవితాలకు సాధనాలివే. మనం ఎంతో కాలంగా ప్రార్ధిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాలనుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నావు నువ్వు. నీ బ్రతుకులో నీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయముంది. నువ్వు దాన్ని తప్పించుకు తిరుగుతున్నావు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్క గట్టేశావు. అది తొలిగిపోతే ఇక మీకు విమోచనే, విజయమే అనుకుంటున్నావు.
పొరపాటు, ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించ గలగాలి. అప్పుడే నువ్వు కోరుకున్న సహనం నీకు అబ్బుతుంది.
వెనక్కి తిరిగి వెళ్ళు. తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలుపంచుకో. ఆయనతో కలసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చికాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ “దేవుని పర్వతాలు” ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలూ ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి భూదిగంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వతపాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది.
శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమేకాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్దిచెట్టు గాలివానలో పరీక్షకి గురవడమే కాదు, దృఢపడుతుంది కూడా.